Listen to this article

జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫార్. కె ఏలియ.

ఆసిఫాబాద్: కుమురంభీమ్ జిల్లా కేంద్రంలోని గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయం చైర్మన్ ప్రైఫెసర్ రియాజ్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క తో కలిసి ఆదివారం సందర్శించారు. లైబ్రరీలో నెలకొన్న సమస్యల గురించి పాఠకులను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా చల్లని మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.లైబ్రరీ సేవలను పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్,గ్రంధాలయం సిబ్బంది,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.