

జనం న్యూస్ ఏప్రిల్ 28( ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ శాఖ 28.4.25 న ముమ్మిడివరం నియోజకవర్గం రైతులకు రూ. 100000/(లక్ష) సబ్సిడీ పై పవర్ టిల్లర్లు . ముమ్మిడివరం నియోజవర్గ శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు అందించడం జరిగింది. మొదటి విడతలో కాట్రేనికోన మండలం లో 3, ఐ. పోలవరం లో 4, ముమ్మిడివరం లొ 4 పవర్ టిల్లర్లు రైతులకు అందించారు. మలి విడతలో ముమ్మిడివరం నియోజకవర్గానికి 25 పవర్ టిల్లర్స్ ఇస్తామని ఎమ్మెల్యే తెలియచేశారు. ఈ కార్యక్రమానికి 3 మండలాల మండల వ్యవసాయాధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు , డబ్ల్యూ ఏ చైర్మన్ కందికుప్ప ఆకాశం శ్రీను , మాజీ జడ్పిటిసి నాగిడి నాగేశ్వరరావు , రైతులు, తదితరులు పాల్గొన్నారు.