

జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
విశాఖపట్నం కు చెందిన కె నాగమణి కి పుట్టిన అప్పటి నుండి ఆమెకు ఒక కాలు చిన్నగ ఉండడం చేత ఆమెకు ఇబ్బంది ఉండి ఏపని చేయలేక పోతుంది. వివాహం అయి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తన భర్త అకాల మరణం చెందాడు. తన పిల్లల ఆలనా పాలనా పోషన అంత తనమీద పడి చాల ఆర్థిక ఇబ్బందులో ఉండి,ఒక సందర్బంలో తెలంగాణ వికలాంగుల హక్కల సాధన సమితి కి కలిసి నాకు ఒక ఆర్టిఫిషల్ కాలు పెట్టించమని కోరగ కూకట్పల్లి ఉన్న భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసు కేంద్రా ట్రస్ట్ సేవా సంస్థ వారిచే కాలు పెట్టించడం జరిగింది. ఎవరైన దాతలు ముందుకు వచ్చి ఈ అమ్మాయి పిల్లలకు మీ సహాయాన్ని అందించగలరు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నరేందర్ మధు స్వామి రఘు కిరణ్ గుత్తికొండ, మెరుగు శివక్రిష్ణ, నాగరాజు మరియు ఆసంస్థ వాళ్ళు పాల్గొంన్నారు.