

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
బి అర్ ఎస్ ప్రభుత్వంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజావ్యతిరేక విధానాలపైన ఎన్నో పొరాటాలు , చేసారు. ఎన్నో ధర్నా లు , ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో దీక్షలు, లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల మీద అక్రమ కేసులు, బైండోవర్ లు, తో పాటు కోర్టు మెట్లు ఎక్కడమే ఆనవాయితీగా మారింది. గత
బి అర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలలో బాగంగా అప్పటి హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప్రస్తుత ఏమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అద్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే అప్పటి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సోమవారం నాడు హుజూరాబాద్ కోర్టులో హాజరు కావడం జరిగింది అని తెలిపారు. కోర్టుకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ దేశిని అయిలయ్య, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న,ఎండీ.సలీం,ఎండీ. అఫ్సర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబు, హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్ప లత,అలేటి సుశీల, మహేశ్వరి,కొఢెం రజిత ఉన్నారు.