Listen to this article

100కిలోల ముత్యాల తలంబ్రాలకు పూజలు నిర్భహించిన

సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు

జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల దేవస్థానం రామకోటి భక్త సమాజం సంస్థను స్థాపించి చేస్తున్న సేవను గుర్తించి రామకోటి రామరాజు,కు 100కిలోల ముత్యాల తలంబ్రాలు అందించగా గజ్వేల్ చేరుకున్న శుభ సందర్బంగా అద్దాల మందిరం వద్ద తలంబ్రాలను రాశిగా పోసి సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికి అందించడానికి ప్యాకెట్లను సిద్ధం చేశారు రామకోటి రామరాజు,దంపతులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది భక్తులకు తలంబ్రాలను అందించడానికి ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. భద్రాచల కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు గ్రామ, గ్రామాన భక్తితో వడ్లను ఓలిచి అందించారన్నారు. వారందరికీ రామయ్య కళ్యాన తలంబ్రాలు అందిస్తామని తెలిపారు. గత 26సంవత్సరాలనుండి నేను చేస్తున్న సేవను గుర్తించి భద్రాచల నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చి మరో భక్త రామదాసుగా కీర్తించి సన్మానించడం జీవితంలో మర్చిపోలేనన్నారు.