

జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ లైన్ నరేంద్ర రిటైర్మెంట్ సందర్భంగా సోమవారం ఉదయం మెదక్ లోని హెచ్ కన్వెన్షన్ హాల్ లో బంధుమిత్రులు కుటుంబ సమేతంగా నిర్వహించిన రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొని వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలతో సత్కరించి పూల బొకేను అందించి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్ పల్లి వాస్తవ్యులు తెలంగాణ స్టేట్ బీసీ లీడర్ తెల్ల హరికృష్ణ, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా, జూనియర్ మరియు డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు వృత్తికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారని, వారి ఇద్దరి పిల్లలను కూడా ఉన్నతమైన చదువులను చదివించి మంచి స్థాయికి తీసుకువెళ్లారని, వారిని చూసి వారి కుటుంబ సభ్యులు స్నేహితులు బంధుమిత్రులు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉపాధ్యాయ రంగంలో వారు చేసిన పలు సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు బంధుమిత్రులు స్నేహితులు అభిమానులు స్థానికులు తదితరులు పాల్గొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నవన్నీ ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.