

జనం న్యూస్ ఏప్రిల్ 28
శాయంపేట మండల కేంద్రానికి చెందిన మారెపల్లి నాగరాజు గోడకూలి మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి నాగరాజు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి వెంట మాజీ ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి నందం,గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మండల యూత్ అధ్యక్షులు మారెపల్లి మోహన్, సీనియర్ నాయకులు కరుణ్ బాబు, దైనంపల్లి సుమన్ ,తదితరులు ఉన్నారు….