Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మాత శిశు హాస్పిటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియర్ చైర్మన్ గోలి సంతోష్,లయన్ రాధాకృష్ణ, లయన్ పరమేశ్వర చారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ 4 వ సంవత్సరం 302 వరోజుకు చేరుకుందని,ఈరోజు ప్రముఖ రచయిత గాయకుడు రాయారావు విశ్వేశ్వర రావు, మంజుల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శంకర్ పంతులు, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ రాంఫనిధర్ రావు, లయన్ డాక్టర్ కుమారస్వామి, లయన్ నేతి శ్రీనివాస్, లయన్ దొంతుల సత్యనారాయణ,లయన్ సామ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు