

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
అందరికీ నమస్కారం భారతదేశానికి సవాలు విసిరి మన భూభాగంలోకి అడుగుపెట్టి మనవాళ్లను అతి కిరాతకంగా చంపి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న దుష్టశక్తులకు శిక్షించే సమయం ఆసన్నమైనది. ఇలాంటి ఉగ్రవాద చర్యలను ఉగ్రవాదులను వాళ్లకు మద్దతునిచ్చే వాళ్లను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడం అనేది లేదు. ఇలాంటి ఘటనకు పాల్పడాలని ఆలోచన కూడా మునుముందు రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మనమందరం భారత సైన్యానికి మద్దతుగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ రేపు అనగా ఏప్రిల్ 29 మంగళవారం సాయంత్రం 5 గంటలకు పాటిమీద ప్రగతి స్కూలు దగ్గర నుంచి కళామందిర్ సెంటర్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులకు మన సంఘీభావాన్ని కొవ్వొత్తులతో మానవహారంగాతో తెలియజేస్తూ ఉగ్రవాద దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తూ,ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమైనటువంటి మన భారత సైన్యానికి మద్దతు తెలపవలసిన బాధ్యత మనందరిపై ఉన్నందున తప్పకుండా ప్రతి ఒక్కరు కులాల మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము