

జుక్కల్ ఏప్రిల్ 29 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన మంగళవారం “కాటేపల్లి అండర్ 17 ప్రీమియర్ లీగ్” ఆధ్వర్యంలో పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలు,పెద్దలు చాలా మంది మొబైల్ తో నే కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుబయట ఆటలకు దాదాపు స్వస్తి పలికారని అన్నారు.ఇది మంచి పరిణామం కాదన్నారు.పిల్లలు పెద్దలు అందరూ కనీసం రోజుకు గంట ఆరుబయట ఆటలు ఆడాలని తెలిపారు.పిల్లలు ఆటలతో పాటు చదువులో రాణించాలని కోరారు.తల్లిదండ్రులపేరును ,గ్రామంపేరును నిలబెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గోకన్ గంగాగౌడ్,నాయకులు ఇస్మాయిల్ పటేల్,ఆకుల రాంచందర్ ,అప్రోజ్ పటేల్,సీనియర్ మెట్టు సోంపేట రాందాస్,పాత్రికేయులు రమేష్ గౌడ్ ,యువకులు,గ్రామస్థులు,వివిద గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.
