Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 29

తర్లుపాడు కు చెందిన భవనం రామచంద్రారెడ్డి తన తండ్రి భవనం పెద్ద వెంకటరెడ్డి జ్ఞాపకార్థం తర్లుపాడు లోని హిందూ మహాప్రస్థానం అభివృద్ధికి 25 వేల రూపాయలు విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. దిక్కు మొక్కు లేకుండా, అభివృద్ధికి నోచుకోని తర్లుపాడు హిందూ స్మశాన వాటికను దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్న సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడైనటువంటి కశ్శెట్టి. జగన్ బాబు కి నేను సైతం అంటూ తన వంతుగా భవనం రామచంద్ర రెడ్డి 25 వేల రూపాయలు విరాళం అందించడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్న దాతలను కశ్శెట్టి. జగన్ బాబు మరియు గ్రామస్తులు అభినందించారు.