

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 29.
సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు కశ్శెట్టి.జగన్ బాబు హిందూ మహాప్రస్థానాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న తీరును చూసి నేను సైతం అంటూ తర్లుపాడు గ్రామానికి చెందిన ఏరువ మహీధర్ రెడ్డి తన వంతుగా 25 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్క హిందువు కు ఉపయోగపడే ఈ కార్యక్రమానికి తన వంతు సహకారం అందించినందుకు చాలా ఆనందంగా ఉందని మహిధర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కశ్శెట్టి.జగన్ మాట్లాడుతూ ,మహీధర్ రెడ్డి తనవంతు ఆర్థిక సాయం అందించడమే కాకుండా తన మిత్రులతోటి కూడా విరాళాలు ఇప్పించారు. మంచి పనికి సహకరిస్తున్న మహీధర్ రెడ్డిని జగన్ మరియు గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందించారు.