Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన, ఏప్రిల్ 2 9 ముమ్మడివరం: ప్రతినిధి

కాట్రేనికోన మండలం నడవపల్లిలో వేంచేసి ఉన్న శ్రీనడవ పల్లమ్మ తల్లి అమ్మ వారి తీర్థ మహెూత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారం భమయ్యాయి. మూడు రోజు ల పాటు జరిగే ఈ తీర్థ మ హెూత్సవాలు మంగళవారం తో ముగిస్తాయని నిర్వాహకు లు తెలిపారు. అంతకుముందు పది రోజులపాటు అమ్మ వారి ఆలయం వద్ద జాతరలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అమ్మ వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కాట్రేనికోన మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా అమ్మ వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకి తరలివ స్తుంటారు. జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మో కా వెంకట సుబ్బారావు యువ మార్చ జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు