

జనం న్యూస్ ఏప్రిల్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి నడిమి లంకలో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్ శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు భారీగా తరలివచ్చి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా మహిళలను అభివృద్ధి పదంలోకి తీసుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ముమ్మిడివరం నియోజకవర్గానికి 10 కుట్టు మిషన్ సెంటర్లను తీసుకువచ్చిన బుచ్చిబాబు గారిని మహిళలు సాలువ కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు. బుచ్చిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి పథకం అమలు జరగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళలు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్న శిక్షణను నేర్చుకొని కుటుంబాన్ని పోషించటానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పథకానికి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు వెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకువస్తున్నారని ప్రతి మహిళ ఇచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని , స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి డిజైనింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చి మహిళలు సొంతంగా డిజైనింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుందని బుచ్చిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర మత్స్యకార డైరెక్టర్ నాగిడి నాగేశ్వరరావు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల్ల కోటి దొరబాబు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, దొమ్మేటి రమణ కుమార్, పొద్దోకు నారాయణరావు, సాగిరాజు సూరిబాబురాజు,ములపర్తి బాలకృష్ణ, గొల్లపల్లి గోపి, కడలి నాగు, అడబాల సతీష్ కుమార్, కట్ట సత్తిబాబు, మాదాల బుజ్జి ,దివి మహాలక్ష్మి, యాళ్ల ఉదయ్, మెండి కమల, బొక్క రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, కాశి రామచంద్రరావు, గోరింట శ్రీను రాజు, సరిపెల్ల శ్రీను రాజు, కాశి లాజర్, నీతిపూడి వంశి, గోదాసి గణేష్, నిమ్మకాయల విష్, జగత గోవిందరావు, కుంచె శ్రీను, బూరుగు కళ్యాణ్, చంటి, మరియు అధికారులు కాన్సిస్టెన్సీ కోఆర్డినేటర్ కె గంగాధర్, ఎన్ నరసింహమూర్తి, వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ పల్లెపాలెం సచివాలయం సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.
