

మా పేదలకు ఇక ఎప్పుడు న్యాయం జరిగేది..
ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ నాయకులు..
నిజమైన నిరుపేదలకు ఇల్లు రాకపోతే స్థానిక ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తాం..
సిరిసేడు గ్రామ మహిళలు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // జమ్మికుంట// కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో, మహిళలు రోడ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయంటూ, రోడ్డుపై కి వచ్చి ధర్నా చేయడం జరిగింది అని తెలిపారు. కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి మరి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, కాంగ్రెస్ నాయకులు కొందరు పైసలకు అమ్ముకుంటున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా, డబ్బులు తీసుకుని, ఇండ్లు ఉన్నవారికి కేటాయించారని ఈ సందర్భంగా అన్నారు. ఇల్లు లేని మాకు ఇందిరమ్మ పథకాల కింద మాకు ఇల్లు వస్తాయనుకుంటే, ఇల్లు రాకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని వివరించారు. ఇలాగే జరిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులను ఒక్కరిని కూడా ఊర్లోకి రానివ్వమని, హెచ్చరించారు. స్థానిక ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని, నిజమైన నిరుపేదలే కాంగ్రెస్ కి ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని, మండిపడ్డారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని, ఇది దృష్టిలో పెట్టుకొని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ మాకు తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.