

బింగి కరుణాకర్ మాజీ సర్పంచ్,బిజెపి జిల్లా కార్యదర్శి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)..
కరీంనగర్ జిల్లాలో వరి కోతలు మొదలై నెల కావస్తుంది, వడ్లకు విత్తన వ్యాపారులు ధర నిర్ణయించకుండానే కొనుగోలు చేస్తున్నారు.తక్షణమే విత్తనవ్యాపారాలు, అగ్రికల్చర్ అధికారులు మరియు తహసిల్దార్ రైతులతో కలిసి ధర నిర్ణయించి కొనుగోలు చేపట్టేలా చూడాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బింగి కుమార్ డిమాండ్ చేసారు.ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సన్న వడ్లకు ప్రభుత్వం మద్దతు ధర 2330 బోనస్ 500 కలిపితే మొత్తం 2830 చెల్లిస్తుందని, ఇప్పటివరకు విత్తన వ్యాపారులు వడ్లకు ధర నిర్ణయించకుండా, ఎలా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వరి పండించాలంటే రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మరియు వరి సాగు మొదలు పెట్టినప్పుడు నుండి ప్రత్యేక దృష్టి సారించి, వరిలో కలుపు నివారణ పొట్ట దశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని , వరి గొలుసు వంచేదశలో కల్తీ విత్తనాలు వేరు చేయుటకు రైతులకు అదనంగా ఎకరానికి 4000 రూపాయలు కూలీలకు ఖర్చవుతుందని, పంట కోసే సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, పంటను కోయాల్సి వస్తుంది అని అని తెలిపారు.ఇలా చేయడం వల్ల రైతుకు మామూలు వరి పండించడానికి,,మరియు ( సీడు) వరి పండించడానికి అదనంగా ఎకరానికి పదివేల రూపాయల ఖర్చు అవుతుంది అని వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులకు మద్దతు ధర చెల్లించే విధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాలని, భారతీయ జనతా పార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే కొనుగోలు చేస్తే,, రైతులు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపోతారని, రైతులు నష్టం లేకుండా ఉండాలంటే అధికారులు శ్రద్ధ తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర 3200 చెల్లించే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నానన్నారు. వరి మద్దతు ధర నిర్ణయించేందుకు సీడు వరి పండించే గ్రామాల నుండి,, గ్రామానికి ఒకరి చొప్పున కచ్చితంగా ఉండే విధంగా వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని ధర నిర్ణయించలన్నారు. లేనిచో రైతులకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని ఇ సందర్బంగా హెచ్చరించారు.