

జనం న్యూస్ – ఏప్రిల్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు మే 1వ తేదీ నుంచి జూన్ 10వ తారీఖు వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నామని పాఠశాల పిఈటి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో బాస్కెట్ బాల్, నెట్ బాల్, అథ్లెటిక్స్ లో శిక్షణ ఇస్తామని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇట్టి శిక్షణా శిబిరానికి పంపించి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు, ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సంప్రదించగలరని తెలిపారు. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి సంబంధించిన వివరాల కొరకు ఫోన్ నెంబర్ 9160 494743 కు సంప్రదించగలరని కోరారు.