

మేము ఇందిరమ్మ ఇళ్లకు అర్హులం కాదా..
మమ్మల్ని చూస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు జాలి లేదా..
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన..
జనం న్యూస్ // ఏప్రిల్ //29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )..
పేద ప్రజలకు మరియు వికలాంగులకు మొండి చేసి చూపుతూ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తున్నారని, దానికి ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడం సిగ్గుచేటని, ఒక వికలాంగుడు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడం జమ్మికుంట ప్రజల నీ విస్మయానికి గురిచేస్తుంది. ఆ వికలాంగుడు ఆవేదన మాటల్లో చెబుతూ.. ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం వికలాంగులకు కేటాయిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట తప్పింది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ బాజీ జమ్మికుంటలో మొత్తం కాంగ్రెస్ లీడర్స్ కి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, భూస్వాములకే కేటాయించారని, నాలాంటి వికలాంగుడి కి ఇందిరమ్మ పథకం మేము అనర్హులమా అని అన్నారు. ఒక ఆసరా పిచ్చెను తప్ప గవర్నమెంట్ పథకాలు ఏ ఒక్కటి కూడా మాకు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 887 సర్వే నెంబర్లో, టిఆర్ఎస్ ప్రభుత్వం మా వికలాంగులకు ఫ్లాట్లు కేటాయిస్తామని, చెప్పిన తర్వాత, అవి కూడా అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ పెద్ద లీడర్లు ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. అప్పుడేమో టిఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది అని ఇప్పుడేమో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మోసం చేస్తున్నదని బాధతో వ్యక్తం చేశారు. మా వికలాంగుల కోసం ఒక్క నాయకుడు కూడా స్పందించక పోవడం చాలా బాధాకరం అని దుఃఖం తో మాట్లాడారు. మాకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశి, మా కోసం మేమే న్యాయం కోసం పోరాడుతామని ఈ సందర్భంగా తెలిపారు
