

బిచ్కుంద ఏప్రిల్ 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సోమలింగ శివాచార్యుల ఆధ్వర్యంలో దివ్య ఆశీస్సులతో 30వ తేదీన ఉదయం ఏడు గంటలకు మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా రాజుల చౌరస్తా వద్ద మఠాధిపతులు జెండా ఆవిష్కరణ చేసి జయంతి వేడుకలు ప్రారంభించిన అనంతరం కొత్త బస్టాండ్.కమ్మర్ గుడి. ఊడమ్మ గల్లి.గాంధీ చౌక్. పాత బస్టాండ్. పోలీస్ స్టేషన్ ముందు నుండి తక్కడపల్లి రోడ్డు గణేష్ మందిరం వరకు డీజే తో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం బసవేశ్వర జయంతి వేడుకలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది.వీరశైవ లింగాయత్ బాంధవులు స్నేహితులు బంధుమిత్రులు ప్రజాప్రతినిధులు నాయకులు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి బసవేశ్వర బైక్ ర్యాలీ జయంతి వేడుకలలో పాల్గొని విజయవంతం చేయగలరని పట్టణ వీరశైవలింగాయతుల వినతి. ఓం నమఃశివాయ