Listen to this article

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

మొన్న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం నాడు జరిగిన భారత రాష్ట్ర సమితి 25 రజకోత్సవ కార్యక్రమంలో , తెలంగాణ ప్రజలను మరో మారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు అన్నారు. మంగళవారం నాడు జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ..భారత రాష్ట్ర సమితి తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రజానీకం అనేక ఇబ్బందులు పడ్డారని , బూటకపు హామీలు ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,,ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రైతు సోదరులకు ఏకకాలంలో రుణమాఫీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళితున్ని ముఖ్యమంత్రి, నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు వాళ్లకు నెలకు 5000 రూపాయలు, అనేక బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది అని మండిపడ్డారు. ఆంతే కాకుండా నేరెళ్లలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూడలేక అడ్డుపడిన దళిత యువకులను చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. మిర్చి రైతు సోదరులు తమ పండించిన పంటకు మద్దతు ధర కావాలని అడుగుతే సంకెళ్లు వేశి జైలుకు పంపించిన చరిత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు మరియు దళిత, గిరిజన, రైతులు సాగు చేసుకున్నటువంటి ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం, వెంచర్లు పెట్టుకొని వారి పొట్ట కొట్టి నానా ఇబ్బందులకు గురి చేశిన చరిత్ర బిఆర్ఎస్ నాయకులదే అని అన్నారు. తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేసే పథకాలను ఒక సంవత్సరం కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు సోదరులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు 60 వేల ఉద్యోగాలు, నియామకం తో పాటు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం రాజీవ్ యువ వికాసం లోన్స్, పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకం, రైతు సోదరులు పండించిన సన్నాఫ్ వడ్లకు క్వింటాలకు 500 బోనస్ షెడ్యూల్, అలాగే కులాల ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సోదరులు 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సుదీర్ఘ పోరాటం న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్త పర్యటన చేసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసి మంత్రులు నలమంద ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, నేతృత్వంలో రిపోర్టును ప్రభుత్వానికి అందజేసి అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగ మాల మరియు ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు తో పాటు బీసీ కుల గణన ఆధారంగా కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చిన ఆధారంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి బీసీ కులాలకు రిజర్వేషన్ ఫలాలను అందజేసిన ఘనత తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దక్కింది అన్నారు.వామపక్ష తీవ్రవాద నిర్మూలన విషయంలో ఆపరేషన్ కాగర్ ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేన రమేష్, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మ్యాకమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మంగ అశోక్, యువజన కాంగ్రెస్ నాయకులు రాముడి సూర్యతేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.