

జనం న్యూస్, ఏప్రియల్ 29, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్, నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, ఝరాసంగంలో, చేపడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, బి.చంద్రశేఖర్, లోకల్ బాడీస్, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, మీకు కనీస సౌకర్యాలు అందుతున్నాయా, అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. మీరు చేసే పనికి తగిన వేతనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదేశించిన కొలతల ప్రకారం మీరు పని చేసినట్లయితే, ప్రతి ఒక్క కూలికి, ప్రతిరోజు 307 రూపాయలు కూలి, మీకు చెల్లించబడుతుంది అన్నారు. పని ప్రదేశంలో ప్రతిరోజు టి ఏ, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పొడవు, వెడల్పు, లోతు, కొలతలు చూపించి, ఆ విధంగా కూలీలు పనిచేయుటకు సహకరించలని, ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. ఎన్ని రోజుల నుండి ఉపాధి హామీ పని చేస్తున్నారని, ఇంతవరకు మీరు ఎన్ని వారాల డబ్బులు తీసుకున్నారని ఉపాధి హామీ కూలీలను అడగగా, తామ ఖాతాలు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయని, రెండు మూడు రోజుల తర్వాత ఇస్తానని, పోస్ట్ ఆఫీస్ అధికారి తమతో చెప్పాడని ఉపాధి హామీ కూలీలు సమాధానం ఇచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ ఝరాసంగం మండలం లోని కుప్పానగర్ గ్రామానికి వెళ్లి అక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశించిన కులతల ప్రకారం మాత్రమే, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని, పురాతన ఇంటి శిథిలాలను తొలగించి, అదే స్థలంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలనుకుంటే, లబ్ధిదారుడే శిథిలాలను తొలగించి, స్థలాన్ని చదును చేసే, ఖర్చు మొత్తాన్ని, లబ్ధిదారుడే భరించాలన్నారు. ఈ కార్యక్రమాలలో జరాసంగం మండల అభివృద్ధి అధికారి, ఎంపీడీవో, సుధాకర్, తహసిల్దార్, తిరుమల రావు, కుప్పా నగర్ గ్రామపంచాయతీ కార్యదర్శి, స్వప్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.