Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

మే 2 తేదీన అమరావతి పున ప్రారంభోత్సవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ శాసన మండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ10,000 జనాభా సేకరించాలని పామర్రు నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలు నిర్దేశించారు గత వైసిపి పాలనలో అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం దానికి ప్రతిఫలంగా ప్రజలు వైసిపి కి 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టి అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అమరావతికి అత్యధికంగా నిధులు కేటాయించి, రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కోట్లాదిగా నిధులు మంజూరు చేస్తూ అమరావతి ఏకైక రాజధానిగా నిర్మాణానికి పరుగులు తీస్తుందని, దానికి తగిన విధంగా వైసీపీకి బుద్ధి చెప్పాలని ఆలోచనతో ప్రధాని మోడీ సభను విజయవంతం చేయడానికి కూటమి పార్టీలు నాయకులు కార్యకర్తలు మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా గ్రామాలు పట్టణం వార్డుల వారీగా ప్రజలను చైతన్యపరిచి మోడీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా శాసనసభ్యులు కుమార్ రాజా నాయకత్వంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని నాగ జగదీష్ పార్టీ శ్రేణులను కోరారు.