

జనం న్యూస్ ఏప్రిల్ 29 నడిగూడెం
వ్యవసాయ రంగంలో రైతుల సంక్షేమం దృష్ట్యా విలువైన సేవలను సూచనలు సలహాలు అందించి రైతులు అభివృద్ధికి తోడ్పడడంతో పాటు ప్రకృతి వ్యవసాయం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసిన ఫలితంగానే అవార్డులు లభించాయని నడిగూడెం తాసిల్దార్ పి.సరిత అన్నారు. సామాజిక వ్యవసాయ కార్యకర్త, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాక్టరేట్ అవార్డు గ్రహీత మొలుగూరి గోపయ్య కు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ పాత్రికేయులు ఎస్ ఎన్ మూర్తి అధ్యక్షతన మంగళవారం జరిగిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి తోడ్పడడంతో పాటు రైతుల సంక్షేమానికి పాటుపడినందున గోపి పలు అవార్డులను సాధించగలిగారని అన్నారు.స్వచ్ఛందంగా రైతులకు సేవలను అందించడం అభినందనీయమన్నారు.గ్రామల్లో రైతులను చైతన్య పరుస్తూ వారి గృహాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయం సాగుపై కలిగే ప్రయోజనాలను వివరించడము ఆయన సేవా కార్యక్రమాలకు నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సాధించాలని ఆకాంక్షించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి దాసరి సంజీవయ్య మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారంగా జీవనాన్ని కొనసాగిస్తున్న రైతుల మేలు కోరి వారికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ సాగులో తీసుకోవలసిన మెలకువలను వివరించడము హర్షించదగ్గ విషయం అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం అవసరం అన్నారు.అవార్డులు సాధించటం అందరికీ ఆయన ఆదర్శనీయమన్నారు. సన్మాన గ్రహీత మొలుగూరి గోపి మాట్లాడుతూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానని ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. ఇందుకు తనకు సహకరిస్తున్న అధికారులకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న నేపద్యంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలులో భాగంగా తన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు వివరిస్తున్నట్లు తెలిపారు.గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన సూచనలు సలహాలను తీసుకుంటున్నారని వారి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.పలు అవార్డులతో పాటు డాక్టరేట్ స్వీకరించటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సన్మానించటము తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉపేందర్ రావు, ఎస్సై అజయ్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి దేవ ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ లావణ్య,మండల పరిషత్ సూపరిండెంట్ సయ్యద్ ఇమామ్,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దున్నా శ్రీనివాస్, పాత్రికేయులు మోత్కూరి శ్రీనివాస్, తంగెళ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోపిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.