

జనం న్యూస్ ఏప్రిల్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో మునగాల లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం నరసింహులగూడెం మాజీ సర్పంచ్ కామ్రేడ్ ముదిరెడ్డి ఆదిరెడ్డి 28 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. కామ్రేడ్ ఆదిరెడ్డి పేదల పక్షపాతిగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సమరశీల పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సైదా, జూలకంటి విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య , దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి, బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, సుంకరి పిచ్చయ్య, రావులపెంట రమేష్, శాఖ కార్యదర్శి సరికొండ నాగరాజు, కిన్నెర వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.
