


రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ చేసిన సేవలను వివరించారు
జనం న్యూస్, ఏప్రిల్ 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జై బాపు-జై భీమ్-జై సంవిధాన్ కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా కల్వచర్ల మెయిన్ రోడ్డు నుండి కురుమపల్లె మీదుగా లొంకకేసారం వరకు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మహాత్మా గాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి ఫూలే వంటి మహానుభావుల చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు వారు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఉమ్మడి కల్వచర్ల కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొలిపాక సారయ్య, వీరగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగిరి మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా భాగస్వామ్యమై పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డ బాపన్న, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య, ఉమ్మడి కమాన్పూర్ మండలం మాజీ జడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీలు ఆరెల్లి దేవక్క కొమరయ్య, కొరుకొప్పుల నీరజా తులసీరామ్ గౌడ్, రామగిరి మండల ఓబిసి అధ్యక్షులు బండారు సదానందం, కిసాన్ సెల్ అధ్యక్షుడు ముచ్చకుర్తి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కొప్పుల గణపతి, కొట్టే సందీప్, మాజీ సర్పంచులు దేవ రామస్వామి, కాటం సత్యం, మాజీ ఉపసర్పంచ్ వేము కనకయ్య, నాయకులు పెద్ది సమ్మయ్య, మట్ట రాజ్ కుమార్, పుల్లెల కొమరయ్యలతోపాటు ఉమ్మడి కల్వచర్ల కాంగ్రెస్ నాయకులు వేముల వెంకటేశ్వర్లు, నాంసాని సందీప్ యాదవ్, చొప్పరి రాజయ్య, రొడ్డ భద్రయ్య, రొడ్డ సంపత్, రేండ్ల కృష్ణమూర్తి, ఆసం రాజు, మేకల మారుతి, బోయిన కొమురయ్య, రాజయ్య, బూడిద రాజేందర్, ఇరుగురాల రమేష్, కొట్టె నాగరాజు, బండి సంపత్, టి. కే.స్వామి, గొట్టెముక్కుల మల్లేష్, దాసరి మనోజ్, ఆర్ల శ్రావణ్, పడాల ప్రసాద్, సూరం లక్ష్మీనారాయణ, గెల్లు పర్వతాలు, మిట్టపల్లి మొగిలి, తదితరులు పాల్గొన్నారు.