Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 30, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

ఈరోజు కల్వచర్ల గ్రామంలోనీ రెండ్ల వాడ,శివాలయం విధికి తరచూ కరెంట్ ఓవర్ లోడ్ సమస్య ఉందని గ్రామస్థులు తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ వెంకటరమణ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కి సమస్యను వివరించగా వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో మాటలాడి గ్రామంలో ఓవర్ లోడ్ సమస్య ఉన్న ప్రతిచోట సర్వే చేసి నూతన ట్రాన్స్ఫార్మ్ (డి టి ఆర్) ఏర్పాటు చేయాలని డిఈ కి ఆదేశాలు ఇవ్వగా ఎడి ,ఏఈ , లైన్ మెన్ గ్రామంలో పర్యటించి మూడు చోట్ల అవసరం ఉన్నదని నిర్ణయించి మూడు డి టి ఆర్ ట్రాన్స్ఫర్లను సాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి డి టి ఆర్ ను రెండ్ల వాడ,శివాలయం వీధిలో అమర్చడం జరిగింది దానిని ఈరోజు ఏఈ,గ్రామ మహిళలు మరియు గ్రామ ప్రజలు,నాయకులు కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఇక రెండు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.ఓవర్ లోడ్ సమస్యను తెలిపిన వెంటనే పరిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు కి, డిఇ, ఏఈ, ఎడి, లైన్ మెన్, తాజా మాజీ సర్పంచ్ గంట పద్మ రమణ రెడ్డి కి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కొట్టే సందీప్,మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య,ముచకుర్తి శ్రీనివాస్, బిరుదు లక్ష్మణ్,అర్రెల్లి కొమ్మురయ్య, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి,రెండ్ల రజిత,రాపెల్లి కోమలత, రెండ్ల రమేష్,రాపెల్లి బాబు, చొప్పరి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ కొలిపాక సారయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల మారుతి,మల్లేష్ గౌడ్,రాజు ,రాజేందర్,సంపత్, లక్ష్మినారాయణ,కుమార్,నాగరాజు , పడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.