Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గాన కోకిల, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు బెల్లి లలిత జయంతి,వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం బరి గీసి కొట్లాడిన వీర వనిత బెల్లి లలితక్క అని, ఆమె ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీళ్ల కోసం ఫ్లోరైడ్ సమస్య, వ్యభిచార నిర్మూలన కోసం ,సమ సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించి తన పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసిన గొప్ప మహా ప్రజా నాయకురాలని అన్నారు. తన పాటల ద్వారా తెలంగాణ ప్రజలలో వస్తున్న చైతన్యన్నీ తట్టుకోలేక కొన్ని దుష్టశక్తులు 17 ముక్కలుచేసి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమరవీరుల పేరుపైన భవనం నిర్మించి, బెల్లి లలితక్క విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసి ఆమె స్మారకార్ధం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పాఠ్య పుస్తకాలలో లలితక్క జీవిత చరిత్రను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మరియు తంగల్లపల్లి రవికుమార్ గారు, బెల్లి చంద్రశేఖర్ యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, ర్యాకాల రమేష్ యాదవ్, బాలన్న, కైరంకొండ వెంకటేష్ , బీసుకుంట్ల సత్యనారాయణ,సబర్కర్ వెంకన్న, కూర శివ,పర్వతి దశరథ యాదవ్, రంజిత్ యాదవ్, ముత్తు , మధుకర్ యాదవ్, పుట్ట శివ యాదవ్, భాగ్యరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.