

.జనం న్యూస్ ఏప్రిల్ 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
యువత క్రీడలపై దృష్టి సారించి, జిల్లా, రాష్ట్రస్థాయిలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావు అన్నారు. మంగళవారం రోజు మహాత్మ జ్యోతిబాపూలే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు హాజరయ్యారు. ఈసందర్బంగా టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పోటీల బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి బహుమతి గెలిచిన ఎడవల్లి జట్టుకు రూపాయలు 20222 రెండో బహుమతి లంజని వీర జట్టు 10222 రూపాయలు అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు చదువుతోపాటు, క్రీడలపై మక్కువ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ గుర్నులే, ఎస్సై ప్రశాంత్, అఖిల భారత మాలి మహా సంఘం జిల్లా అధ్యక్షులు మెంగజీ గున్నులే, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మండోకర్ అనిల్, యూత్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు జాబోరే గణేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ దాదాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, నగా భూషణ్, సెండే హనుమంతు,క్రిస్నా,మాజీ ఉప సర్పంచ్, గ్రామ పటేల్ దివాకర్బెండరే,మల్లయ్య,పాండు ,నిర్వాహకులు విటల్ గురనులే, బండారి శ్రీహరి, వడై రామచందర్, బెండరి కిషోర్, తదితరులు పాల్గొన్నారు
