

జనం న్యూస్ 18 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ జగన్ అభిమాని గెడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె లో లోకేశ్‌ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.