Listen to this article

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మద్నూర్ ఏప్రిల్ 29 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటు వంటి భూ భారతి 2025 (ఆర్.ఓ.ఆర్ చట్టం) తెలంగాణ రైతులకు ఆయుధం లాంటిదని దాన్ని సద్వినియోగం చేసుకొని రైతుల భూ సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. గత ధరణి పోర్టల్ వాళ్ల ఏ అధికారికి భూ సమస్యను పరిష్కరించే అధికారం లేదని, భూ భారతి చట్టం వల్ల తహసీల్దార్ నుండి ఆర్.డి.వో స్థాయి వరకు చాలా భూ సమస్యలకు పరిష్కారం దొరికే హక్కులు ఈ చట్టం లో ఉన్నాయని అన్నారు. CCLA వరకు వెళ్లకుండా ఈ చట్టం వల్ల జిల్లా స్థాయిలోనే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. దేశంలోనే ఈ భూ భారతి చట్టం ప్రతిష్ఠాత్మకమైంది అని, దేశం లోని ఏ రాష్ట్రంలో కూడా రైతుకు ఇన్ని అవకాశాలు భూ సమస్యలకు హక్కులు ఇవ్వలేదన్నారు.
ఆర్. వో. ఆర్ 2025 చట్టం వలన భూ భారతి తో రైతు సమస్య పరిష్కారం కు వికేంద్రీకరణ జరగబోతుంది అన్నారు. ఈ సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని భూ భారతి చట్టంలో అప్పిలు వ్యవస్థ ఉంటుందని , అప్పీల్ వ్యవస్థలో కూడా ఉచితంగా భూ సమస్యల పరిష్కారం కోసం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భూ కమతాల పరిధి అనేది చెప్పడానికి ప్రతీ రైతుకు భూధార్ కార్డును, నెంబర్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని అన్నారు. గ్రామాలలోకి లైసెన్సుడ్ సర్వేయర్లు, అదేవిధంగా గ్రామ పాలన రెవిన్యూ అధికారులు రాబోతున్నారని దీనివలన భూ రిజిస్ట్రేషన్, వారసత్వ భూ బదలాయిపు వాటికి ప్రతిదానికి భూమి యొక్క చిత్రపటంను డాక్యుమెంట్లో పొందపరచడం జరుగుతుందని భూభారతి చట్టంలో ఆ విధంగా చేర్చడం జరిగిందని తెలిపారు. పట్టా పాస్ పుస్తకంలో తప్పులు జరుగుతే గతంలో మార్చడానికి సరైన విధానం లేదని ప్రస్తుత చట్టం ద్వారా తాసిల్దార్ కార్యాలయంలోనే భూభారత్ చట్టంతో మార్పులకు, చేర్పులకు అవకాశం ఇచ్చారని అన్నారు. mఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి DCO రామ్మోహన్ మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపిడిఓ రాణి, మండల వ్యవసాయ అధికారి రాజు, PACS ఛైర్మెన్ శ్రీనివాస్ పటేల్ , రైతులు, రైతు ప్రతినిధులు, మండల ప్రజలు పాల్గొన్నారు.