Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో. రాజుల చౌరస్తా బసవేశ్వర చౌక్ వద్ద విశ్వగురు మహాత్మా బసవేశ్వర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. బిచ్కుంద మఠాధిపతి. శ్రీ శ్రీ. సోమయ్య అప్ప మహా స్వామీజీ ముఖ్య అతిథులుగా పాల్గొని విశ్వ గురు మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి పూజ చేసి జెండా ఆవిష్కరించారు అనంతరం బసవేశ్వర చౌరస్తా నుండి బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ కమ్మర్ గుడి గాంధీ చౌక్ శివాజీ చౌక్ పోలీస్ స్టేషన్ నుండి తక్కడపల్లి రోడ్డు గణేష్ మందిర్ ఆలయం వద్ద బసవేశ్వర భవనం స్థలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం బసవేశ్వర భవనం స్థలంలో శ్రీ మల్లికార్జున అప్ప పూజ చేసి జెండా ఆవిష్కరించారు అనంతరం అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ జెడ్పిటిసి ఎన్ రాజు ,మల్లేశం వకీల్ , ప్రకాష్ వకీల్ సాబ్ , రాజుల విజయ పటేల్ , బసవరాజ్ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్ , రాజేందర్ అప్ప, సిద్ధప్ప పటేల్, కల్లాలి బండు పటేల్, కల్లాలి నాగనాథ్ సార్, రవీందర్ సార్, రాజుల మల్లికార్జున్ , కుశాల్ సార్, రాజుల మాధవరావు సార్, పుండ్లి పటేల్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సంజు , చట్టం టీవీ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ , టీవీ5 రిపోర్టర్ శంకర్ పటేల్ , . సిఐటియు. జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ. సీనియర్ రిపోర్టర్ మహా టీవీ గంగాధర్ ,రామచందర్ డీలర్, బిచ్కుంద మాజీ వైస్ ఎంపీపీ రాజు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ దేవాడ బిచ్కుంద పట్టణంలోని వీరసేవ లింగాయత్ సభ్యులు గ్రామ ప్రజలు ,పాల్గొన్నారు.