Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

నందలూరు మండల కేంద్ర వాసి పూల సురేష్ కుమార్ మెదడుకు సంబందించిన అనారోగ్య కారణంగా వేలూరు CMC హాస్పిటల్లో వైద్య చేయించుకున్న సందర్భంలో ఆర్ధికంగా పూర్తిగా దిగజారిన పరిస్థితిలో రాజంపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ వద్దకు వెళ్లి ప్రభుత్వ సాయం కోరడం జరిగింది. సాయి లోకేష్ దయనీయ పరిస్థితిని గమనించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి కి సురేష్ అనారోగ్యం, వైద్యానికి అయిన లక్షలరూపాయల ఖర్చులకు సంబందించిన బిల్లులు అన్ని చూపించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వీరి కుటుంబానికి తప్పనిసరిగా సాయం అందేలా చూడాలని కోరడం జరిగింది. పురందరేశ్వరి వ్యక్తిగత శ్రద్ద తీసుకొని పూల సురేష్ కి CMRF నుండి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కోరగా,సీఎం సురేష్ కి Rs. 4,61,770/-( అక్షరాల నాలుగు లక్షల అరవైఒక్కవేల ఏడు వందలాడెబ్భై రూపాయలు) ను మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి నేడు ఉదయం సాయి లోకేష్ రాజంపేట అసెంబ్లీ కో కన్వీనరు డా. అరిగె రాంప్రసాద్, రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, మరియు మండల బీజేపీ కార్యకర్తలూ, నాయకులు ఆది నారాయణ ,మహేష్, రాచూరి మురళి, జయకుమార్ రెడ్డి, HD ప్రసాద్, మండెం నాగేంద్ర, గంగాధర్ లతో కలిసి వెళ్లి నందలూరు జడ్పీ హైస్కూల్ సమీపాన నివసిస్తున్న పూల సురేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయిన డబ్బులకు సంబందించిన చెక్కును వారికి అందజేయడం జరిగింది.