Listen to this article

(జనం న్యూస్ ఏప్రిల్ 30. చంటి)

బుదవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం గూర్చి అవగాహన కార్యక్రమాలకి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి తో కలిసి ఈ క్రమంలో పాల్గొన్నారు. ముందుగా భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ…. రైతులకి ఈ భూ భారతి చట్టం లో చక్కటి పరిష్కారం జరుగుతుంది. ఈ చట్టం పైన గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలనీ తెలిపారు. కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి ఇప్పుడు కబ్జా లు ఉన్న భూములు వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఈ చట్టం లో ఉంది. ఆఫీస్ కి వచ్చిన రైతులకి ఓపికతో సమాధానం చెప్పాలి. ప్రజలకు అందరూ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఇంక చిత్త శుద్ధి తో పనిచేయాలి. భూ భారతి చట్టం చేసేటప్పుడు మా కమిషన్ సలహాలు సూచనలు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన భూములలో ఎస్సీ ఎస్టీ ప్రజలు చాలా మంది కబ్జా లో ఉన్నారు కానీ వారి పేరు మీద పట్టా లేక రైతు భరోసా పడక చాలా మంది నష్టపోతున్నారు అని వారికి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సంవత్సరం పాటు భూ సమస్యలు, రైతులు పట్టెదార్లు ఎదుర్కున్న విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మేధావులు, ప్రజలు, ఇతలరులందరితో చర్చించి సలహాలు, సూచనలు స్వీకరించి 4 జనవరి 2025 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, 14 ఏప్రిల్ 2025 తేదీ నాడు ఈ భూ భారతి చట్టం అమలులోకి తెచ్చింది. సాదా బైనమాకి సంబంధించి తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన 2014 అంటే రాష్ట్రం ఏర్పడే కంటే ముందు ఒకవేళ అప్పుడు తెల్ల కాగితం మీద కొనుగోలు చేసి ఉండి సన్న చిన్నకార రైతులు అక్టోబర్ 12 2020 నుంచి నవంబర్ 10 2020 మధ్యలో ఆర్జీ పెట్టుకొని గత 12 సంవత్సరాలు కాస్తూ లొ ఉన్నట్లయితే జిల్లా వ్యాప్తంగా సుమారు 44000అప్లికేషన్స్ మన దగ్గర ఉన్నాయని తప్పకుండా వాటి మీద కూడా అర్హులు అందరికీ కూడా ప్రాసెస్ చేసి వారందరికీ ఆ భూమి పైన హక్కులు కల్పియాలని కూడా ఈ భూభారతి చట్టం ఉంది. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూమిపై హక్కులు కల్గిన వారు, మోకా మీద లేకుండా కొంత మంది అమ్ముకున్న వారి 1977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ అమ్మడానికి వీలులేదు అని రెగ్యులరైజేషన్ చేసే ఆప్షన్ ఉంది. అనర్హులకు చేతికి వెళితే వారి నుండి ప్రభుత్వం భూమిని తీసుకుని అర్హులైన వారికి అందివ్వడం జరుగుతుంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, ఇతరత్రా భూములు ఎవరైనా కబ్జా చేసి ఉంటే వారికి నోటీస్ ఫీల్డ్ వెరిఫై చేసి నిజనిర్దరణ జరిపి నిర్ణిత కాల వ్యవధిలో ప్రభుత్వం తీసుకుంటుంది. వారసత్వ భూములు కుటుంబాలలో కలహాలు జరుగుతాయని అందరి వారసులను నోటిస్ ఇచ్చి పిలిపించి మ్యుటేషన్ పద్ధతిలో నెల రోజుల పరిష్కారం. సర్వే నంబర్ రీ సర్వే చెయ్యడానికి సర్వే నంబర్లు ఉన్న భూ యజమానులు అందరిని పిలిపించి అందరూ అమోదం తెలిపి రీ సర్వే నంబర్ ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, పి ఏ సి ఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగ మూర్తి, తహసిల్దార్, చంద్రశేఖర్ఎంపీడీవో, వెంకట లక్ష్మమ్మ . ఉప తాసిల్దార్ జైహిర్ ఖాన్. సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్. జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ ఆర్ఐ నాగరాజు. వివిధ గ్రామాల పార్టీ నాయకులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.