

కబ్జా అయిన భూమిని కాపాడాలంటూ ఆర్డిఓ,ఎమ్మార్వో కి వినతిపత్రం..
సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష
జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 793/ఎ/2 793/బి గల సర్వే నెంబర్ భూమి కబ్జాకు గురైందని సామాజిక కార్యకర్త సిలివేరి శ్రీకాంత్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారు మీడియా ద్వారా మాట్లాడుతూ… జమ్మికుంట పట్టణంలోని మోత్కల గూడెం స్మశాన వాటిక రోడ్డు కబ్జాకు గురైందని గడిచిన వారం రోజుల కిందట ఎమ్మార్వో ఆర్డీవో లను కలిసి ఆ భూమిని కాపాడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు.కానీ ఆ స్థలంలో పాతిన బోర్డును తొలగించి అక్రమంగా ప్రహరిగోడ నిర్మించారని ఈనెల 26 తారీఖున ఎమ్మార్వో ఆర్డీవో లను ఆ స్థలానికి పిలిపించి విచారణ చేపట్టడం జరిగిందని, తెలిపారు.అనంతరం అధికారులు ఈ స్థలన్ని పాత పద్ధతిలో నిర్మించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చినట్టుగా తెలిపారు. అయినా ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని వారు అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే, ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగుతుందని, ఈ కబ్జాపై అధికారుల చర్యలు ఆలస్యమైతే ఎంతవరకైనా, పోరాటం చేస్తానని న్యాయం జరిగే వరకూ ఏ ఒక్క అధికారుల ను కూడా వదిలే ప్రసక్తే లేదని సిలివేరి శ్రీకాంత్ అధికారులను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నానాని తెలిపారు.