Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

వీణవంక మండల కేంద్రంలోని గొల్ల, కురుమల ఇలవేల్పైన బీరన్న దేవాలయాన్ని అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం హనుమాన్ భక్తులు శుభ్రపరచారు. బీరన్న దేవాలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ మాలదారులు ఆలయ ప్రాంగణంలో కుటీరం ఏర్పాటు చేసుకుని, హనుమాన్ పీఠం ప్రతిష్టాపన చేసుకుని, 21 రోజులు భక్తిశ్రద్ధలతో, ఉదయం సాయంత్రం శ్రీరామ నామాన్ని జపిస్తూ, మూడు పూటలు స్నానమాచరిస్తూ, సూచి, శుభ్రతతో ఉదయం సాయంత్రం దేవాలయాన్ని దర్శిస్తూ, మధ్యాహ్న సమయంలో భిక్ష స్వీకరిస్తూ, సాయంత్రం సమయంలో భజన పాటలు పాడుతూ, నిత్య హనుమాన్ ఆరాధనలో ఉంటూ, హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తూ, కొండగట్టు, భద్రాచలం, ఇల్లందకుంట లాంటి వైష్ణవ క్షేత్రాలను తిరుగుతూ, శ్రీరామచంద్ర స్వామిని, హనుమాన్ దర్శిస్తూ, చివరికి హనుమాన్ జయంతి నాడు మాల విరమణ చేయడం జరుగుతుందని, మాల వేసుకునే ఒకరోజు ముందు బీరన్న దేవాలయాన్ని హనుమాన్ భక్తులు అందరం కలిసి దుమ్ము ధూళి లేకుండా చేసి, నీటితో గంటల తరబడి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ముష్కి శ్రీనివాస్, ముద్దెర శ్రీనివాస్, మల్లెత్తుల సదానందం,బొమ్మ శంకర్, కొలుపుల మహేష్, తాళ్ల పెళ్లి అఖిల్, కొలుపుల శివ, తాళ్ల పెళ్లి పవన్ కుమార్ , తాళ్లపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.