

జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
జిల్లాలోని మున్సిపల్ రికార్డుల ఆడిట్ నిర్వహణకు ఆసక్తి గల ఆడిటర్లు మే 8 లోపు దరఖాస్తులు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ఉన్న రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి ,సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీ లలోని ఏరియా లెవెల్ ఫెడరేషన్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ కు సంబంధించిన రికార్డులను ఆడిట్ చేయడానికి ఆసక్తి అర్హత అనుభవం కలిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆడిటర్లు పూర్తి వివరాలతో పాటు తగిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ దరఖాస్తు సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఆడిట్ నిర్వహణకు ఆసక్తి అర్హత కలిగిన ఆడిటర్లు తమ దరఖాస్తులను పథక సంచాలకులు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ వారి కార్యాలయంలో మే 08 లోపు సమర్పించాలని, ఇతర వివరాలకు చరవాణి నెంబర్ 6304894940 నందు సంప్రదించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.