

ఉద్యోగులకు పదవీ విరమణ సహజం
ఎస్సారెస్పీ ఈఈ శశిభూషణ్
జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, విరమణ అనంతరం కుటుంబాలతో ఆనందంగా జీవించాలని ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) శశి భూషణ్ అన్నారు. ఎస్సారెస్పీ హుజురాబాద్ సబ్ డివిజన్-2 పరిధిలో ఉమెన్ మజ్దూర్ గా పనిచేసిన పర్వీన్ ఏప్రిల్ 30న పదవి విరమణ పొందారు. కాగా బుధవారం పర్వీన్ ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని కెసి క్యాంపు లోని డిఈ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈఈ శశిభూషణ్ మాట్లాడుతూ.. విశ్రాంత జీవితంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదవి విరమణ కేవలం వృత్తికే కానీ వ్యక్తిత్వానికి, మనసుకు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ లు వెంకట రామ వరప్రసాద్, రాము, రవీందర్, డీఏఓ నాగయ్య, ఏఈ రతీశ్, సహచర ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.