Listen to this article

పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

పౌర హక్కులకు భంగం కలిగించొద్దు

డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ

జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మునగాల మండల డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కోదండరాంపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సత్యనారాయణ మాట్లాడుతూ..భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కుల వివక్ష లేకుండా గ్రామంలో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని తెలిపారు.బడి, గుడి అందరికీ సమానమేనని,వాటిల్లోకి ఎవరైనా పోవచ్చని తెలిపారు.కులమతాలకు అతీతంగా కలిసి ఉంటేనే పౌరహక్కులను సమా నంగా అందరూ అనుభవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, రామారావు,స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి కవిత, ఎస్సీ కాలనీవాసులు,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.