Listen to this article

తాసిల్దార్ జి రమేష్ బాబు,, పట్టణ సీఐ వరగంటి రవి.

జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోగల 8వ వార్డులోని సర్వే నంబర్ 793/ఏ/2, 793/బి లో గల స్మశాన వాటిక దారి స్థలము కబ్జా విషయమై సామాజిక కార్యకర్త సిల్వేరి శ్రీకాంత్ ఆమరణ నిరాహార దీక్ష చెప్పట్టారు. రెవెన్యూ మరియు పోలీసుల హామీతో దీక్ష విరమణ చేసారు. సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ, పోడేటి రామస్వామి, కొండ్లె పాపయ్య, మంద సాంబయ్య, పరిమెల కిషోర్ , మరియు వివిధ సామాజిక, ఉద్యమ, కుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిలివేరు శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఎం.పీ.ఆర్ గార్డెన్ సమీపాన ఉన్న హిందూ స్మశాన వాటికకు సంబంధించి ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించే లక్షలాది రూపాయల విలువైన దారిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన స్థలాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా, సంబంధిత సమస్య విషయంలో ఎలాంటి చర్యలు లేనందున, ఈనాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు.
ఇట్టి దీక్ష విషయమై జిల్లా ఉన్నత అధికారుల ఆదేశానుసారం స్థానిక తహసిల్దార్ జి. రమేష్ బాబు మరియు స్థానిక పట్టణ సి.ఐ వరంగంటి రవి లు తమ సిబ్బందితో దీక్ష శిబిరం వద్దకు చేరుకొని సంబంధిత సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ దీక్షను విరమింప చేయటం జరిగిందన్నారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిర్ణిత సమయంలో కబ్జాదారుల నుండి దారి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సంబంధిత కబ్జాదారులపై, చట్టపరమైన చర్యలు చేపట్టని లేని యెడల, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు పూనుకోవటం జరుగుతుందని తెలియజేసారు.