

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
విద్యా సంవత్సరానికి గాను కుంకుమేశ్వర స్వామి గుడి ముందు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల. ఈరోజు వెలువడిన పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిందని. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్ మాట్లాడుతూ విద్యార్థుల మీద వ్యక్తిగత శ్రద్ధ ఉపాధ్యాయుల కృషి ఫలితంగా 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. అందరూ ఉత్తీర్ణత సాధించడం హర్షనీయం అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముందు ముందు జిల్లాలోనే మొదటి స్థానంలో మాన పాఠశాల ఉండడానికి కృషి చేస్తామని తెలియజేశారు