Listen to this article

జనం న్యూస్
జనవరి 18 మెదక్ జిల్లా
చిలిపి చెడు మండలంలో నీ ఫైజాబాద్ గ్రామంలో కోతుల సమూహం బీభత్సాన్ని సృష్టించాయి. ఫైజాబాద్ గ్రామానికి చెందిన వంజరీ బుచ్చయ్య పై శనివారం రోజున ఉదయం 6:30 గంటల సమయంలో కోతుల సమూహం ఒక్కసారిగా దాడి చేశాయి ఈ కోతుల దాడిలో వంజారి బుచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం బుచ్చయ్య పశువుల పాకలో పాలు పితకడానికి వెళ్ళాడు . పశువుల పాకలో గేదే పిల్లను కట్టేస్తుండగా ఒంటరిగా ఉన్న బుచ్చయ్య పైకోతుల సమూహం ఒకసారిగా వేటాడి దాడి చేశాయి ఈ దాడిలో బుచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి కోతుల దాడిలో వంజరి బుచ్చయ్యకు రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి కోతుల దాడి సమయంలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని కోతులను వెంబడించడంతో తను ప్రమాదం తప్పిందని తెలియజేశారు గతంలో ఇదే తరహాలో కోతుల దాడిలో అనేకమంది పై దాడి చేసి గాయాల పాలు చేసింనాయని తెలియజేశారు. తీవ్ర గాయాలైన వంజరి బుచ్చయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి జోగిపేటకు తరలించారు ఫైజాబాద్ గ్రామంలో కోతులు పదుల సంఖ్యలో దాడీలు చేసి గాయపరచడం జరిగింది ఈల్ల నుంచి బయటకు రావాలంటే గ్రామస్తులు వానికి పోతున్నారు గ్రామంలో ఉన్న కోతులను గ్రామపంచాయతీ వారు కోతులను పట్టి ఫారెస్ట్ లో వదిలేయాలని గ్రామస్తులు సూచిస్తున్నారు