Listen to this article

జనం న్యూస్ మే 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

84 వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనకాపల్లికి సభ్యత్వం కార్డులు పంపించారని, వీటిని 84 వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి సభ్యత్వం నమోదు కార్డు ట్యాగ్ తో పాటు 194 వ బూత్ లో 163 మంది సభ్యులకు అందజేశామని అనకాపల్లి పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి కుప్పిలి జగన్ తెలియజేశారు. అలాగే 195,196 బూత్ లకు సంబంధించి సభ్యత్వం నమోదు చేసుకున్న వారందరికీ కూడా అందజేస్తామని జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకటరావు అయిత అప్పలనారాయణ సారిపల్లి శ్రీనివాసరావు కాండ్రేగుల జగదీష్ కసిరెడ్డి కొండలరావు ముగ్గు తమ్మారావు కెల్లక శ్రీనివాసరావు ఎం రాజా కాసిన లక్ష్మి ఏనుగుల దేవి రోమాల లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.//