

జనం న్యూస్ 18.జనవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదపడతాయని భవిష్యత్తులో రైతుల స్థితిగతులను తీర్చిదిద్దటంలో రైతు ఉత్పత్తి సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శ్రీమతి కుష్బూ గుప్తా పేర్కొన్నారు.శనివారం ఉట్నూరు ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో ట్రైకార్ మొదటి దశ చెక్కులను ప్రాజెక్టు అధికారిని లబ్ధిదారులకు అందించారు. ట్రై కార్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మరియు రెబ్బేన రైతు ఉత్పత్తి సంఘాలకు మొదటి దశ రాయితీ గా ఒక్కో రైతు ఉత్పత్తి సంఘానికి రూ. 7.50 లక్షలు చొప్పున మొత్తం 15 లక్షల రూపాయలు విడుదల అయ్యాయి.. వాటికీ సంబంధించిన రాయితీ చెక్కులను రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులకు ఐటీడీఎ కార్యాలయం లో ప్రాజెక్టు అధికారి శ్రీమతి ఖుష్ గుప్తా, ఐఏఎస్ అందించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉద్యాన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్, సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి సుజాత, రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులు వినోద్, ప్రశాంత్, ప్రజ్ఞా శీల్, బోర్డు డైరెక్టర్ లు పాల్గొన్నారు.