


జనం న్యూస్,మే 02 ,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. అన్న ప్రసన్న గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను గుర్తించి తగిన చర్యలు తీసుకొనుచుండగా విధులకు విధులకు అడ్డుపడడం మరియు వారిపైనే యజమాన్యం వారి ఉద్యోగుచే కేసు పెట్టించడం సమంజసం కాదని ఈ సంఘటన ను ఖండిస్తూ జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్, మరియు సీనియర్ డాక్టర్లు ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి వారి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే అధికారులకు సహకరించాలని కోరారు.జిల్లా వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్.