Listen to this article

సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం

జనం న్యూస్ – మే 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లొ నెట్ బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ సంపత్ గౌడ్ పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లలిత తో కలసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎస్సై సంపత్ గౌడ్ మాట్లాడుతూ శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని తెలిపారు, సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా క్రీడల వైపు ఆసక్తి కనపరిచే విధంగా చూడాలని అన్నారు. తమ పాఠశాలలో చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంపత్ గౌడ్ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత, పాఠశాల పి ఈ టి కిరణ్ కుమార్, సీనియర్ క్రీడాకారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.