

జనం న్యూస్ జనవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మునగపాక మండలం అరబు పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను అరబుపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమమును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెంటకోట ప్రకాష్ రావు, ఆడారి యోగేశ్వరరావు, పాలు సెంటర్ ప్రెసిడెంట్ బొడ్డేడ గంగాధర్ రావు, దొడ్డి కృష్ణ, కోయిలాడ శేషు,బి. గంగాధర్ రావు ఆడారిశ్రీను, మోహన్ రావు, పైడికొండ టిడిపి నాయకులు పాల్గొన్నారు.//