

జనం న్యూస్ మే 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఉపాధి హామీ కూలీగా జీవనం సాగిస్తున్న నేస్తం టీవీ స్టాఫ్ రిపోర్టర్ దుర్గం శరత్ చంద్రకు ప్రభుత్వ అనుసంధాన పథకాల వెలుగు తాకడం లేదు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి నీరాజనం కాదా?
తాటినగర్ గ్రామం నుంచి వెలుసిన విలేకరితన దీపం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన దుర్గం శరత్ చంద్ర… చిన్న వయసులోనే సమాజ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. సాదాసీదా కుటుంబానికి చెందిన ఈ యువకుడు నేస్తం టీవీలో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూ అనేక గ్రామాల ప్రజల సమస్యలను అధికారుల ముందుకు చొచ్చుకుపోతూ ప్రజల ఆశగా నిలుస్తున్నాడు.అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజల కోసం పోరాడే ఈ విలేకరి… తాను మాత్రం ఉపాధి హామీ పనుల్లో కూలీగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దుస్థితి దుర్గం శరత్ చంద్ర వ్యక్తిగతంగా కాదు… రాష్ట్రవ్యాప్తంగా సమాజంపై ప్రశ్నలు వేస్తున్న వాస్తవం.ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే అర్హులెవరు? రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరమ్మ పథకం” పేరుతో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రతి బడ్జెట్లో గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఇప్పటికీ తాటినగర్ గ్రామానికి చెందిన దుర్గం శరత్ చంద్ర కి ఏ ఇల్లు కేటాయించలేదు.పత్రికలవల్లే ప్రజాస్వామ్యానికి ఊపిరి వచ్చిందని చెప్పే అధికారులకు అలాంటి విలేకరికి ఇల్లు ఇవ్వడం ఎంత దూరం? దుర్గం శరత్ చంద్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని ఆశపడ్డాడు.ఆయనకు ఉన్న సామర్థ్యం, సృజనాత్మకత, ప్రజలతో ఉండే అనుబంధం ఒక ఉద్యమశక్తిగా మారే స్థాయిలో ఉంది. ఈయనకు రాజీవ్ యువ వికాస్ ద్వారా స్వయం ఉపాధి కోసం లోన్ మంజూరు చేయడం ద్వారా ఒక సామాజిక మార్గదర్శకుడిని నిలబెట్టవచ్చు.అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంతవరకూ ఏ సహాయం తాకలేదు. ఇది మరొక విధంగా యువతకు ప్రభుత్వం ఇచ్చే సందేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాదు నిస్సహాయతను కూడా పెంచుతుంది. విలేకరితనం అంటే ఉద్యోగం కాదు… ఉద్యమం ప్రజల శబ్దాన్ని ప్రభుత్వ కళ్ల ముందు నిలిపే పుణ్యపుణ్యులే విలేకరులు. అలాంటి వ్యక్తి ప్రభుత్వ పథకాల బలపడేలా చేయకపోతే ప్రజాస్వామ్య పటుత్వం ఎక్కడ? విలేకరులు ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలంటే వారి పునాది బలంగా ఉండాలి. అది కేవలం కుటుంబ పోషణకే కాదు, సామాజిక నైతికతకు అవసరం. ప్రభుత్వానికి విజ్ఞప్తి – న్యాయం చేయండి ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కి, కౌటాల మండల అధికారులకు మనవి దుర్గం శరత్ చంద్ర కి ఇందిరమ్మ పథకం ద్వారా తక్షణం ఇల్లు కేటాయించండి. రాజీవ్ యువ వికాస్ లోన్ ద్వారా స్వయం ఉపాధికి తోడ్పాటునివ్వండి విలేకరుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు, పథకాలు రూపొందించండి సామాజిక స్పష్టత, ప్రభుత్వ జవాబుదారీకి ఇది పరీక్ష ఈ రోజు దుర్గం శరత్ చంద్ర ఒక అభ్యర్థనగా కనిపించవచ్చు. కానీ రేపటి సామాజిక చైతన్యానికి చిరునామా కావచ్చు.అలాంటి వారిని ముందుకు నెట్టడం ప్రభుత్వ, మానవతా బాధ్యత