Listen to this article

కార్యకర్తలను కాపడుకుంటాం..

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు..

హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్.

జనం న్యూస్ // మే // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా వచ్చిన నమిండ్ల శ్రీనివాస్,రఘునాథ్ రెడ్డి తెలిపారు.శనివారం నాడు హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్స్ లో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నిర్మాణ,సంస్థాగత సమావేశానికి వారు హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని పార్టీని నిర్మాణ పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి,సంస్థాగతంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్యకర్తలకు వివరించారు.గడచిన కాలంలో ఎంపీ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తుందని ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కార్యకర్తలు మరింత కష్టపడి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ప్రణవ్ కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,భగవాన్ రెడ్డి,అన్ని మండలాల అధ్యక్షులు,పట్టణ అధ్యక్షులు,మహిళా పట్టణ,మండల అధ్యక్షురాలు,మార్కెట్ కమిటీ చైర్మన్లు,డైరెక్టర్లు,ఇళ్ళంధకుంట,హా నుమాన్ దేవాలయాల చైర్మన్లు,డైరెక్టర్లు,సొసైటీ చైర్మెన్లు,యూత్ కాంగ్రెస్,ఎన్ఎస్యుఐ,బ్లాక్ కాంగ్రెస్,కాంగ్రెస్ సేవాదళ్,సోషల్ మీడియా ఇంచార్జిలు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.