

శాయంపేట,మే 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
విద్యార్థులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడంమే కాక కట్టిపడేస్తాయి. అంతేగాక వాళ్ళని చూడగానే పిట్ట కొంచెం కూతగనం అనే సామెత గుర్తుకు రాక మానదు. అలాంటి ప్రతిభాపాటాలను ప్రదర్శిస్తోంది ఈ విద్యార్థిని. ఈ విద్యార్థిని చిన్నవయసులో కూచిపూడి నృత్యం చేసి శభాష్ అనిపించుకుంటుంది. శాయంపేట మండల కేంద్రమం చెందిన కన్నం చంద్రశేఖర్ పార్వతీల కుమార్తె కన్నం లాస్య 2023 న జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షణ సంస్థ కృషి నృత్య అకాడమీ వారు నిర్వహించిన 4218 మంది ప్రదర్శించిన కూచిపూడి నృత్యంలో భాగంగా కన్నం లాస్యకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి. ఈ అవార్డు రవీంద్ర భారతి మినీ హాల్లో తెలంగాణ భాష సంస్కృతి సంచాలకులు మామిడి హరికృష్ణ ద్వారా ఈ అవార్డు అందుకున్నారు….