Listen to this article

జనం న్యూస్ మే 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వర ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమస్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు మావోయిస్టుల పేరుతో ఈ దేశము ఉలవాసులైన ఆదివాసీలను అడవి నుండి బయటకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారు మండిపడ్డారు గత ప్రభుత్వాలు ఆదివాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టాలను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మావోయిస్టులో జాడ లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ పూనటం హేయమైన చర్య అని వారు అన్నారు
కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు
రాజ్యాంగ హక్కులను పేద ప్రజలకు పూర్తిగా అందించినప్పుడు సామాజిక అసమానతలు లేకుండా ప్రభుత్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండదని అన్నారు
ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని తెలియజేశారు మావోయిస్టులను అణిచివేయాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వారు విమర్శించారు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ ప్రజా సంక్షేమమే పరమపదిగా పనిచేసినప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమాజంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారనిప్రభుత్వాలు ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతున్నారని . అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చినప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపినట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలకు పూనుకోవాలని కోరారు…..